భద్రాద్రి రాముడి సేవలో మంత్రులు

share on facebook

భద్రాచలం,జూన్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలను అందచేశారు. అనంతరం కడియం శ్రీహరి విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. రైతుబంధు ఒక విప్లవాత్మక పథకంగా అభివర్ణించారు. తెలంగాణలో లౌకికవాదానికి పెద్దపీట వేశామని కడియం శ్రీహరి తెలిపారు.

 

Other News

Comments are closed.