భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శం.

share on facebook
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి):
భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుని పై ఉందని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి అన్నారు.శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా ఉయ్యాలవాడ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు అదనపు కలెక్టర్ మోతిలాల్, స్థానిక శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి లకు రాఖీ కట్టారు.
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…..మీకు నేను రక్ష, నాకు మీరు రక్ష, మన మందరం దేశానికి రక్ష అని అన్నారు.భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉన్నాయని, అన్నా చెల్లెల అనుబంధం ఎంతో గొప్పదని అన్నారు.
రాఖీ కట్టిన సందర్భంగా విద్యార్థులందరికీ వినియోగించుకునేలా పాఠశాలలో ఏదైనా ఏర్పాటు చేయాలని 50 వేల రూపాయల నగదును పాఠశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డికి అందజేశారు.
అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ….విద్యార్థులు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని అన్నారు.రాఖీ కట్టిన విద్యార్థులందరికీ అదనపు కలెక్టర్ పెన్నులను బహుకరించారు.అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పన, ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదనపు కలెక్టర్ మోతిలాల్ కు రాఖీలు కట్టారు.
విద్యార్థులతో ఎమ్మెల్యే తన ఫోన్ తో సెల్ఫీలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, నాగర్ కర్నూల్ జడ్పిటిసి శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.