భారత్‌ ఏ దేశంపై దాడి చేయలేదు

share on facebook

modi-03-oct-2016

– భూదాహం మాకు లేదు

– బాపూజీకి ప్రధాని మోదీ ఘన నివాళి

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 2(జనంసాక్షి): భారత్‌ ఎప్పుడూ ఏ ఇతర దేశంపైనా దాడి చేయలేదని,  ఎవరి భూభాగం కోసం ఆశపడలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కానీ, ఇతర దేశాలకోసం ప్రపంచంలోనే

త్యాగపూరితమైన పోరాటాలు చేసిందని చెప్పారు. ‘భారత్‌ ఎప్పుడూ ఏ దేశంపైనా దాడి చేయలేదు. ఏ దేశ భూభాగం కోసం భారత్‌కు ఆకలి లేదు. కానీ రెండు ప్రపంచ

యుద్ధాల్లో భారత దేశం 1.5లక్షల మంది భారతీయ సైనికులను ఇతర దేశాలకోసం కోల్పోయింది’అని మోదీ చెప్పారు. ఆదివారం సాయంత్రం ఇక్కడ ప్రవాసీ భారతీయ కేంద్రానికి సంబంధించి అధునాతన భవనం ప్రారంభించి జాతికి అంకితం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని చాలా చోట్ల భారతీయ సైనికుల త్యాగాలు ఉన్నాయన్నారు. అందుకే తాను ఏ దేశానికి వెళ్లిన అక్కడ భారత జవాన్ల స్మారక స్థూపాలను సందర్శిస్తానని చెప్పారు. భారతీయులు ఎక్కడకు వెళ్లినా సమాజ హితం కోసమే బతుకుతారని, నీళ్లవంటివారని, పరిస్థతికి తగినట్లుగా తమను తాము మార్చుకోగల సమర్థులని అన్నారు. విదేశాలకు వెళ్లిన భారతీయుల అంకెళ్లో చూడకూడదని, వారినొక శక్తిగా చూడాలని చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయులను ఒక చానెలైజ్‌ గా మారిస్తే వారు భారత్‌ ను దేదీప్యమానంగా వెళిగేలా చూస్తారని కొనియాడారు.భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సమయంలో సరిహద్దు ప్రాంతం పంజాబ్‌లోని దినానగర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ బుడగలు కలకలం సృష్టించాయి. అవి మోడీని ఉర్దూలో హెచ్చరిస్తూ రెండు బుడగలు కనిపించాయి. ”మోదీజీ.. అయుబ్‌ (పాకిస్థాన్‌ మాజీ ప్రధాని) వదిలిన కత్తులు ఇప్పటికీ మా దగ్గరే ఉన్నాయి. ఇస్లాం జిందాబాద్‌ (మోదీజీ అయుబ్‌ కి తల్వారీ అభీ హమారే పాస్‌ హై. ఇస్లాం జిందాబాద్‌)” అంటూ పేపర్‌పై రాసి పసుపు రంగులోని బుడగలపై అతికించారు. వీటిని దినానగర్‌లోని ఘేసల్‌ గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.గత రెండేళ్లలో చూస్తే ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది భారతీయులను, విదేశీయులను రక్షించిందన్నారు. 150 దేశాల్లో భారతీయులు ఉన్నారని, వాళ్లు నీళ్లలాంటి వాళ్లు అన్నారు. పరిస్థితులను బట్టి వాళ్లను వాళ్లు మార్చుకుంటారని ఎన్నారైలను కొనియాడారు.ఇతరుల కోసం భారతీయులు త్యాగాలు చేశారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఒకటిన్నర లక్షల మంది భారతీయులు అమరులయ్యారని చెప్పారు. కానీ దీనిని మనం గట్టిగా చెప్పలేకపోయామని అన్నారు. శనివారం నాడు పారికర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇతర దేశాలను ఆక్రమించుకునే ఉద్దేశ్యం అంశంపై పారికర్‌ స్పందించారు. తమకు మరో దేశాన్ని ఆక్రమించుకోవాలనే కోరిక లేదన్నారు. భగవాన్‌ శ్రీరాముడు లంకను గెలిచిన అనంతరం దానిని రావణాసురుడి సోదరుడు విభీషణుడికి ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బంగ్లాదేశ్‌ విషయంలో తాము చేసింది అదే అన్నారు. తాము ఎవరికీ చెడు తలపెట్టమని చెప్పారు. కానీ మాకు ఎవరైనా చెడు చేయాలనుకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. భారత సైన్యాన్ని హనుమంతునితో పోల్చారు. దాడులు చేసేంత వరకూ భారత సైన్యానికి వారి పరాక్రమం తెలియదన్నారు. ఆర్మీ పైన పారికర్‌ ప్రశంసలు కురిపించారు.ఇదిలా ఉంటే అక్టోబర్‌ 2 (నేడు) జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ  నివాళులర్పించారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. అలాగే మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. ఇంకా గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రజలు ఖాధీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపు నిచ్చారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ మాట్లాడుతూ.. పేదలు అత్యధికంగా ఉన్న ఖాదీ రంగంలో ఉన్నారని వారిని ప్రోత్సహించేందుకు స్వదీశీ వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. మహాత్మా గాంధీ 192 లో ఖాదీ ఉద్యమాన్ని ప్రారంభించారని మోడీ గుర్తు చేశారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *