భారీగా ఒంటె మాంసం స్వాధీనం

share on facebook

 

– హైదరాబాద్‌ తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు

– ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నల్గొండ, నవంబర్‌16(జ‌నంసాక్షి) : నల్గొండ జిల్లా శివారులో స్థానిక పోలీసులు భారీగా ఒంటె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలోని ఓ రైతు పొలంలో మాంసాన్ని తీసి తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు వాటిని అడ్డుకొని నిందుతులను అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ప్రాంతానికి కొందరు వ్యక్తులు 30 నాలుగు లారీల్లో 30ఒంటెలను తీసుకొచ్చారు. మండలంలోని ఊకొండి గ్రామ శివారులోని నిమ్మల స్వామి అనే రైతు వ్యవసాయ భూమిలో బుధవారం అర్థారాత్రి సమయంలో 26ఒంటెలను వధించారు. ఆ మాంసాన్ని డీసీఎంలో తరలించేందుకు సిద్ధం చేశారు. మిగతా 5 ఒంటెలను కోసే క్రమంలో పోలీసులు దాడులు చేయడంతో ఈ వ్యవహారం గుట్టురట్టయింది. ఈ దాడుల్లో సుమారు 20 టన్నులకు పైగా మాంసాన్ని స్వాధీనం చేసుకొని, 25 మంది నిందితులను అరెస్టు చేశారు. సంఘటన స్థలంలోని రెడు లారీలు, 3 డీసీఎంలు, 2 కార్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఒంటెలను హరియాణా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి.. మాంసాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు.. ఎవరి సహకారంతో తరలిస్తున్నారు.. అనే విషయాలపై పోలీలు విచారణ చేపట్టారు. కాగా హైదరాబాద్‌కు, చెన్నైకు ఈ మాంసం తరలిస్తారని తెలిసింది. కేజీ రూ.400కు పైనే ధర పలుకుతున్నట్లు సమాచారం.

Other News

Comments are closed.