భారీగా గుట్కా,గంజాయి స్వాధీనం

share on facebook

హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): అక్రమంగా తరలిస్తున్న గుట్కా, గంజాయిలను పెద్దమొత్తంలో  అధికారులు గుర్తించి పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీల సందర్భంగా విజిలెన్స్‌ అధికారులు వ్యానులో తరలిస్తున్న రూ. 5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ సవిూపంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

Other News

Comments are closed.