భువనగిరిలో కుప్పకూలిన శిక్షణ విమానం

share on facebook

భువనగిరి,నవంబర్‌28(జనంసాక్షి): హైదరాబాద్‌లోని హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరిన ఓ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటన బుధవారం భువనగిరి జిల్లాలో జరిగింది. శిక్షణ విమానం బహుపేటలో కూలింది. అయితే ప్యారాచూట్‌ సాయంతో పైలట్‌ ప్రాణాలతో తప్పించుకున్నారు. నేలపై వాలిని పైలట్‌కు స్థానికులు సాయం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌ ఆ శిక్షణ విమానానికి పైలట్‌గా ఉన్నారు. స్వల్పంగా గాయపడ్డ అతన్ని హాస్పటల్‌కు తరలించారు. ఈ ఘటనతో విమానం కాలి బూడిదయ్యింది. గటన ప్రాంతాన్ని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.

 

Other News

Comments are closed.