భువనగిరిలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

share on facebook

చెత్త తొలగింపునకు ప్రత్యేక చర్యలు

భువనగిరి,నవంబర్‌5(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రమైన భువనగిరి మున్సిపాలిటీ రూపురేఖల్ని తీర్చిదిద్దేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ అహర్నిశలు శ్రమిస్తున్నారు. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తానని భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. తొలిదశలో ప్రజలను వ్యాపారులను చైతన్యం చేయడం తరవాత హెచ్చరించడం, ఆ తరవాత జరిమానాలలో మేల్కొల్పడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో కొత్తగా ఏర్పడ జిల్లా కేంద్రంలో పారిశుద్ద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందని, దీన్ని మరింత పటిష్ఠం చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు కొంత మేర మార్పులు అవసరం. అపరిశుభ్రంగా ఉన్న బేకరీలు, ¬టళ్లు, తినుబండారాల షాపుల్లో స్వచ్ఛత పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మున్సిపల్‌ వాహనాల్లో డీజిల్‌ వినియోగం కొనసాగుతోందని, వాహనాల మరమ్మతుల పేరిట కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని వాటిపై నిఘా పెట్టామని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఆదాయ వనరుల వివరాలను సేకరిచి, భారీగా ఆదాయం లభించే ఆస్తి పన్నులో ఉన్న వ్యత్యాసాలతోపాటు లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ పక్రియ ద్వారా త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించి ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. పనిచేసే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి కీలక విభాగాల్లో నియమిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టంను మెరుగుపరిచి,. ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ఆక్రమణలు నియంత్రించేందుకు రోడ్డు డెవల్‌మెంట్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు పరుస్తున్నారు. ప్రధానంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి

సూచనలు తీసుకుంటున్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రధాన భూమిక పోషించేలా ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు.

 

 

Other News

Comments are closed.