మంచులోయలో పడి..  ఇద్దరు పర్వాతారోహకుల మృతి

share on facebook

కరీంనగర్‌, సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని కోలా¬య్‌ మంచునది లోయలో కూరుకుపోయి ఇద్దరు పర్వాతారోహకులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 10మంది పర్వాతారోహకులు కోలా¬య్‌ మంచు పర్వతప్రాంతానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో వారిలోని ముగ్గురు ప్రమాదవశాత్తూ లోయలో పడి కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో నవీన్‌ జిలాని, ఆదిల్‌ షా అనే ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన మరో వ్యక్తిని అందులో నుంచి బయటకు తీశారు. మృతుడు నవీన్‌ జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో ఎక్సైజ్‌, టాక్సేషన్‌ అధికారిగా పనిచేస్తుండగా, ఆదిల్‌ ఓ టూర్‌ట్రావెల్‌ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ పర్యటకులను రక్షించడానికి వైమానిక బలగాలు ఆ ప్రాంతానికి వెళ్లాయని చెప్పారు. కోలా¬య్‌ నదీ ప్రాంతమంతా 5కిలోవిూటర్ల పొడవుతో పూర్తిగా మంచుతో కప్పి ఉంటుంది. సాహస యాత్ర చేయడానికి పర్వాతారోహకులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్సాహం చూపుతుంటారు.

Other News

Comments are closed.