మండలంలో నక్షలైట్ల కదలికలను నివారిద్దాం

share on facebook

 

సమాచారంను ఆందిస్తే బహుమతిని అందించి , వారి వివరాలు గుప్యంగా ఉంచుతాం

ఎస్‌ఐ లాలా మురళి

వీర్నపల్లి నవంబర్‌ 18 (జనంసాక్షి):వీర్నపల్లి ఒక మారుమూల మండలం.ఈ మండలంలో మావోయిస్టు ప్రభావంతో పాటు నక్సలైట్‌ యాక్షన్‌ టీం కదలికలు లేవని మండల ఎస్సై లాలా మురళి అన్నారు.విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నక్సలైట్ల యాక్షన్‌ టీం సంచరిస్తున్నారని సమాచారంతో ముందస్తుగా యాక్షన్‌ టీం సభ్యులు ఫోటోలతో కూడిన వాల్‌ పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు.వీటిని ప్రతి గ్రామంలో అతికించడం జరిగిందన్నారు.ఈ మండలం అంతా నిఘా నీడలో ఉందని నక్సలైట్ల యాక్షన్‌ టీం సంచారం నివరించాలన్నారు యాక్షన్‌ టీంలో 12 మంది ఉన్నారని,వీరిలో చతీస్గడ్‌,భద్రాద్రి, కొత్తగూడెం, అదిలాబాద్‌, కరీంనగర్‌,మంచిర్యాలకు, చెందిన వారుని ప్రజాపోరిటమనే ముసుగులో తిరుగుతున్నారని వీరి సమాచారం అందించిన వారికి ఐదు లక్షల బహుమతి ఇస్తామని, వారి పేరును గోప్యంగా ఉంచుతామన్నారు. కావున మండలంలో ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు కనబడిన,గుంపు గా తిరుగుతున్న వారి సమాచారాన్ని నేరుగా ఫోను ద్వారా గాని 100 డైల్‌ ద్వారా గాని సమాచారాన్ని ఇస్తే వారికి తగిన పారితోషకం ఇవ్వబడుతుంది వారిని గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ నిజముద్దీన్‌ కానిస్టేబుల్‌ రాజు శంకర్‌ ¬ంగార్డు మహిపాల్‌ ,గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Other News

Comments are closed.