మండుటెండలతో ప్రజల అగచాట్లు

share on facebook


ఎండలతో జాగ్రత్త అంటున్న వైద్యులు
ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మార్చి ముగుస్తున్న వేళ జిల్లాలో ఎండలు తీవ్రం అయ్యాయి. బయటకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ దశలో పనుల కోసం వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఎండతీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరుగుతన్న  సమయాల్లో ఎక్కువగా బయట తిరగకూడదన్నారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలి. అత్యవసరం ఉంటే త్వరగా పనులు ముగించుకోవాలి. బయట లేత రంగు, తేలికైన, కాటన్‌ దుస్తువులు, టోపి, గొడుగు లాంటివి తప్పనిసరిగా వాడాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌, మజ్జిగ, గ్లూకోజ్‌ లాంటి ద్రావణాలు దెగ్గర ఉంచుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు
తీసుకుంటూ వడదెబ్బకు గురికాకుండా ఉండాలని సూచిస్తున్నారు.  వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల తాకిడితో డిహైడ్రేషన్‌తో శరీరంలో నీరు తగ్గడం వల్ల ప్రాణాపాయం కూడా సంభవిస్తుందని హెచ్చరించారు.ఎండలో అధిక వేడిలో తిరగడంతో ఇది ఏర్పడుతుందన్నారు. ప్రతి రోజూ 5 లేదా 6 లీటర్ల నీటిని తప్పకుండా
తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ఎక్కవ ప్రాధాన్యం ఇస్తూ, శరీరంతో పాటు ఇంటిని చల్లగా ఉంచుకోవాలన్నారు.  రోడ్లపై విక్రయించే రంగు పానియాలు, కలుషిత ఆహారం తీసుకోకూడదు. మాంసాహారం తగ్గించి తాజా కూరగాయలు తీసుకోవా లన్నారు. ఎండవేడిమి వల్ల వడదెబ్తగిలితన వారికి ఉష్ణోగ్రత్త సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో శరీరమంతా తుడుచుకుంటూ ఫ్యాన్‌, చల్లని గాలి తగిలేలా చూడాలన్నారు.  ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించి వీలైనంత త్వరగా ప్రభుత్వ  ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం తరలించాలని అన్నారు. అలాగే పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని వారు ఎండలో తిరుగకుండా చూడాలన్నారు.

Other News

Comments are closed.