మత్స్యకారులకు అండగా జనసేనాని

share on facebook

టెక్నాలజీతో తీరప్రాంత కోతను అరికడతాం

మత్సకార భేటీలో పవన్‌ కళ్యాణ్‌

కాకినాడ,నవంబర్‌6(జ‌నంసాక్షి): మత్స్యకారులకు అండగా నిలబడతానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ మినీ కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మత్స్యకారులకు ఒక సోదరుడిగా ఉంటానన్నారు. మత్స్యకారుల సమస్యల తనకు తెలుసన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో తీర ప్రాంత కోతను అరికడతామన్నారు. ప్రభుత్వం మినీ హర్బర్‌ ను ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. మత్స్యకారులకు అండగా ఉండి విూ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మత్స్యకారుల సమస్యల కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, కొంచెం కష్టమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మత్స్యకారుల కోసం మినీ కోల్డ్‌ స్టేరేజ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకార యువత పర్యాటక రంగంలో భాగస్తులు కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ అందమైన తీర ప్రాంతాన్ని రక్షించడానికి విదేశీ టెక్నాలజీ వినియోగించి బీచ్‌ కోతను ఆపొచ్చన్నారు. పరిశ్రమల కాలుష్యంతో మత్స్య సంపద చనిపోతోందని, కొన్ని అరుదైన జాతులు అంతరించి పోతున్నాయన్నారు. కాలుష్యాలు వెదచల్లే పరిశ్రమలను అరికడతామన్నారు. కాలుష్యం శుద్ది చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల బోటులు, పడవలకు డీజిల్‌ సబ్సిడీ ఇచ్చే విధంగా చూస్తామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

 

 

Other News

Comments are closed.