మత్స్యకారులకు భారీగా ప్రోత్సాహకాలు

share on facebook

చెరువుల నిండగానే చేపవిత్తనాల పంపిణీ

వికారాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ మత్స్యకారులకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధికి గతంలో ఎప్పుడు లేని విధంగా చేపలను చెరువుల్లో వదిలి వారికి జీవనోపాధి కల్పించడమే కాకుండా ఆర్థికాభివృద్ధి చెందేందుకు లక్షల సంఖ్యలో చేప పిల్లలను వదులుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.50 కోట్ల చేపపిల్లలను 493 చెరువులు, ప్రాజెక్టులు, కుంటల్లో వదిలేందుకు అధికారులు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. జిల్లాలో 4,500 మత్స్యకారులు, 95 సహకార సొసైటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో మూడు మహిళా మత్స్యకార సహకార సొసైటీ సంఘాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మత్స్యకారులకు పెద్దపీట వేస్తూ వారీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మత్స్యకారుల సహకార సంఘాలు ఏర్పాటు చేస్తూ, వారిని బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మత్స్యకారుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. జిల్లాలో గత ఏడాది టార్గెట్‌ 75

లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదలాల్సి ఉండగా అందులో 200 చెరువుల్లో 53.41లక్షల చేప పిల్లలను వదిలి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేశారు. దీని ద్వారా మత్స్యకారులకు జీవనోపాధే కాకుండా

జిల్లాకు కావాల్సిన చేపల సీడ్స్‌ను తెచ్చేందుకు రెండు ఏజెన్సీల నుంచి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్లి సీడ్‌ను పరిశీలించినట్లు అధికారులు తెలియజేశారు. జిల్లాకు చేపల సీడ్‌ను కృష్ణా జిల్లా కైకలూర్‌ నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు తీసుకొచ్చాక సీడ్‌ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు ఈ చేపలు బాగా తట్టుకొని వృద్ధి చెందే చేపల సీడ్‌ను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులకు సౌకర్యంగా ఉండేందుకు 75 శాతం సబ్సిడీతో ప్రభుత్వం వాహనాలను అందించేందుకు మార్గం సుగమం చేసింది. వర్షాలు బాగ కురిసి చెరువుల్లో, కుంటల్లో నీరు రాగానే భారీగా చేప పిల్లల సీడ్స్‌ను వదులుతాంరు. ఇప్పటికే సీడ్‌ను సిద్ధంగా ఉంచడం జరిగింది.

Other News

Comments are closed.