మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట

share on facebook

– రాష్ట్రంలో 86 కోట్ల చేప పిల్లల ఉచిత పంపిణీ
– రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
– అక్కమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి
రంగారెడ్డి, ఆగస్టు14(జ‌నం సాక్షి) : మత్స్యకారుల అభివృద్ధి కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 86కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నందిగా మండలం నర్సప్పగూడలోని అక్కమ్మ చెరువులో మంత్రి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో పాటు కేసీఆర్‌ అధికారంలోకి రావడంతో పేద వర్గాల ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దఫా 86 కోట్ల చేప విత్తనాలను రాష్ట్రంలో ఇస్తున్నామన్నారు. గంగపుత్రులు, మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల విత్తనాలు గత మూడేళ్ల అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణెళి అని వివరించారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో 600 చెరువులలో కోటి 32 లక్షల చేప పిల్లలు అందించగా.. షాద్‌ నగర్‌ నియోజకవర్గంలో 145 చెరువులలో 35 లక్షల చేపల విత్తనాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో కోటి 30 లక్షలతో 13 చేపల మార్కెట్లు, రూ. 18 కోట్లతో మత్స్యకారులకు సామాగ్రి, వాహనాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్‌ పట్టుదలతో ముందుకు సాగుతున్నారన్నారు. దీనిలో భాగంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, అభివృద్ధిని అడ్డుకొనేందుకు యత్నిస్తున్నారన్నారు. రాహుల్‌ గాంధీ వచ్చినంత మాత్రాన తెరాసకు వచ్చిన నష్టమేవిూ లేదని, తెలంగాణలో మరో20ఏళ్ల పాటు తెరాసనే అధికారంలో ఉంచేందుకు ప్రజలు ఫిక్స్‌ అయ్యారని మంత్రి వాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్‌, బీజేపీల అడ్రస్సు గల్లంతు కావటం ఖాయమని మంత్రి పేర్కొన్నారు.

Other News

Comments are closed.