మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వం కృషి

share on facebook

– మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటాం
– రూ.5.25కోట్లతో బేగంబజార్‌లో చేపల మార్కెట్‌
– మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
హైదరాబాద్‌, జనవరి24(జ‌నంసాక్షి) : నగరంలోని బేగంబజార్‌లో అత్యాధునిక వసతులతో చేపల మార్కెట్‌ నిర్మిస్తున్నట్లు పశుసంవర్థక, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రూ5.25 కోట్ల వ్యయంతో చేపల మార్కెట్‌ నిర్మాణ పనులకు మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. భవన నిర్మాణం కోసం జాతీయ మత్స్యాభివృద్ధి సంస్థ రెండున్నర కోట్లు నిధులివ్వగా… మిగిలిన రూ. 3కోట్లు జీహెచ్‌ఎంసీ సమకురుస్తోందని మంత్రి తెలిపారు. సెల్లార్‌ పార్కింగ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ¬ల్‌సేల్‌ దుకాణాలు, కోల్డ్‌ స్టోరేజ్‌, మొదటి అంతస్తులో చేపల కటింగ్‌, రిటైల్‌ వ్యాపారాల నిమిత్తం నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ మార్కెట్‌ నిర్మాణం పూర్తయితే మత్స్యకారులకు ఎంతో సౌకర్యవంతంగా, ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. దీని ద్వారా మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు పోకుండా ఎవరి ప్రాంతాల్లో వారు చేపలు పట్టుకొని వాటిద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మత్స్యకారుల సంఘాలకు రాయితీలపై రుణాలు, పరికరాలు, వలలు వంటివి అందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. రాబోయే కాలంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని తద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.