మన్యంలో వైద్యం కొరత

share on facebook


ఇక్కట్ల పాలవుతున్న గర్భిణులు
విశాఖపట్టణం,మార్చి18(జ‌నంసాక్షి): గిరిజనాల్లో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండడంతో మరణాలకు అడ్డుకట్ట పడడంలేదు. వన్యంలోని 11 మండలాల్లో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. పాడేరు, అరకు, చింతపల్లిలో పెద్ద వైద్యశాలలున్నాయి. అన్ని మౌలిక వసతులూ ఉన్నాయి. కానీ వైద్యనిపుణులు లేకపోవడంతో ఇవన్నీ ఉన్నా లేనట్లే అన్నట్లుగా మారాయి. 16వేల మంది వరకు గర్భిణులు, బాలింతలకు వైద్యసేవలు అందాల్సి ఉన్నా మౌలిక వసతుల లేమి, లక్ష మంది వరకు విద్యార్థులున్నారు. వీరిని
రక్తహీనత వెంటాడుతోంది.. మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలు అధిగమించండంతోపాటు వసతిగృహాల ద్వారా సరైన పౌష్టికాహారం అందించగలిగితే ఈ లోపాలనూ అధిగమించవచ్చు. చదువుకు దూరంగా ఉన్న చిన్నారుల ఆరోగ్యపరిస్థితిపైనా దృష్టిసారించాల్సి ఉందని కోరుతున్నారు.  హెచ్‌బీ పరీక్షల్లో 65 వేల మంది విద్యార్థులకు 8 శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్‌ ఉన్నట్లు తేలింది.  గర్భిణిలు, బాలింతలకు ఐరన్‌ మాత్రలు అందించేందుకు గ్రామాల్లో ఆశా కార్యకర్తలున్నా వారి దగ్గర మాత్రలు లేకపోవడంతో ప్రయోజనం లేకపోతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్బిణులను పరీక్షిస్తూ 6 శాతం కంటే హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న గర్భిణులకు రక్తం ఎక్కించాలి. ఏజెన్సీలో రక్తం నిల్వల కొరత కారణంగా ఎక్కడా అమలు కావడం లేదు. కనీసం పాడేరు, అరకు, చింతపల్లి వైద్యశాలల్లో ప్రసూతి, శిశు వైద్యనిపుణులు, ఎనస్థీషియాను అందుబాటులో ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచిక్సిత్సలకు వీలుంటుంది. ప్రసవ వేదనతో మరణాల శాతమూ తగ్గుతుందని అంటున్నారు. మన్యంలో వైద్యనిపుణులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి  డాక్టర్‌ జె.సరోజిని అన్నారు.  వందల గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యసేవలకు ఆస్పత్రులకు తరలించే లోపే మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు.  గ్రామాల్లోకి సిబ్బందిని పంపి ఆరోగ్యపరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులూ ఎక్కువగా మన్యంలో ఉన్నారు. ఈ పరిస్థితినీ అధిగమించాల్సిఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ
మన్యంలో  శిశు మరణాలు, మాతృ మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. మన్యంలోని 60 శాతం మరణాలకు రక్తహీనత కారణం కావడం గమనార్హం. మిగిలిన మరణాలు వైద్యసేవల్లో లోపాలు, ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన లోపం తదితరమైనవి కారణమవుతున్నాయి.  ఇక్కడ ఏటా మలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, విష జర్వాలతోపాటు, ఆంత్రాక్స్‌ ఇలా పలు రుగ్మతలు ఆందోళన కలిగిస్తున్నారు. దీనికితోడు సికిల్‌సెల్‌ అనీమియా, రక్తహీతన లాంటి రుగ్మతలూ వెంటాడుతూ కాటేస్తున్నాయి. గిరి పుత్రులకు పోషకాహారం అందించేందుకు రాయితీపై నిత్యావసరాలు అందించంతోపాటు రూ. కోట్లు వెచ్చించి చిన్నారుల కోసం గిరి గోరుముద్దలు, గర్భిణులు.. బాలింతలకు అన్న అమృత హస్తం పథకాలు నిర్వహిస్తోంది. లబ్దిదారులకు సమర్థంగా పోషకాహారం అందడంలేదు. వీటిని పక్కాగా అమలు చేయాలని కోరుతున్నారు.

Other News

Comments are closed.