మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

share on facebook

యువత,మహిళలు అంతా కలసి రావాలి
ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి
కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  పిలుపునిచ్చారు. ఆయన నేరుగా ప్రజలను కలుస్తూ టిఆర్‌ఎస్‌కు ఓటేయాలని అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికలను మించి ప్రజలు కదలాలని, కెసిఆర్‌ను గెలిపించాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం చేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు ఎంపీల బలం ఉంటే కేంద్రంలో కీలకంగా వ్యవహరించడం ఖాయమని, టీఆర్‌ఎస్‌ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ ఏర్పడే పరిస్థితి ఉండదన్నారు.
విద్యార్థి,యువత, మహిళలు ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని కోరారు. ఎంపీగా వినోద్‌ కుమార్‌ అనేక అభివృద్ధి పనులు చేశారని,ఆయనకు  మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే కేంద్రంలో కీలకంగా మారి విభజన చట్టంలో సవరణ చేపట్టి ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ ¬దా తీసుకొస్తారని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహ 16 సీట్లు గెలవడం ద్వారా ఢిల్లీలోని ఎర్రకోటపై పాగా వేద్దామని  అన్నారు. సీఎం కెసిఆర్‌ నేతృత్వంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిపారన్నారు. రైతు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వ్యవసాయాన్ని పండుగ చేశారని, రైతుబీమా, రైతుబంధు, భూ రికార్డుల ప్రక్షాళన వంటి పథకాలు అమలు పరిచిన మొదటి రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరుతున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయాన్ని అందించాలని ఆయన కోరారు.

Other News

Comments are closed.