మళ్లీ గెలుపు టిఆర్‌ఎస్‌దే అంటున్న మాజీలు

share on facebook

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): త్వరలో జరగనున్న సార్వత్రి ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో అన్ని స్థానాలు టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని, ఇక్కడ టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని ఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్‌ ఛైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. టిఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ది, కెసిఆర్‌ దార్శనికతే గెలుపుకు గీటురాయి అన్నారు. నాలుగేళ్లలో ఎన్నడూ లేని అభివృద్ది జరిగిందన్నారు. అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మరోమారు టిక్కెట్‌ దక్కడంతో పలువురు మాజీ ఎమ్మెల్యే తాటితో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఇకపోతే అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మణుగూరు మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సకలజనుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. మణుగూరులో మళ్లీ గులాబి జెండా ఎగురవేస్తామని అన్నారు. ప్పుడూ ఊహించని విధంగా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మన దేశంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. ఈ అభివృద్ది తమను గెలిపిస్తుందన్నారు.

Other News

Comments are closed.