మహాకూటమి ప్రచారంతో మోసపోవద్దు

share on facebook

టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే అభివృద్ది
ప్రచారంలో టిఆర్‌ఎస్‌ నేతలు
కొత్తగూడెం,నవంబర్‌29(జ‌నంసాక్షి): పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఈ ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏవిూలేదని, రానున్న ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు ఓటేస్తే ఈ ప్రాంత ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు తప్పవని అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. మహాకూటమి ప్రచారంతో మోసపోవద్దని అన్నారు. గ్రామాల్లో  తాటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని  ఓటర్లను కోరారు.సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేశారన్నారు. గ్రామగ్రామానా ప్రజలందరూ కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారని, స్వచ్ఛందంగా ఇప్పటికే పార్టీలో భారీగా వచ్చి చేరుతున్నారని తనకు అడుగడుగునా మద్దతు పలుకుతున్నారని పేర్కొన్నారు. మహాకూటమి నాయకుల మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. మళ్లీ కేసీఆర్‌ పాలన రావాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని,అప్పుడే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. పేదల అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ధ్యేయమని,నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా గ్రామాలకు వచ్చిన మదన్‌లాల్‌కు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు.  ఆయా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మదన్‌లాల్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందన్నారు. పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి పట్టంకట్టి రాష్ట్ర అభివద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.యావత్‌ దేశానికి ఆదర్శంగా పరిపాలన సాగించి ప్రజలచేత మన్ననలు పొందిన కేసీఆర్‌ మరోసారి ముఖ్యమం త్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. నాలుగున్నరేళ్లలో వైరా నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు.

Other News

Comments are closed.