మహాత్ముల అడుగుజాడల్లో నడవాలి

share on facebook

-విద్యాబివృద్దికి ఆజాద్‌ చేసిన సేవలు మరువలేనివి
-డీఆర్‌ఓ శ్యాంప్రసాద్‌
రాజన్నసిరిసిల్ల,నవంబర్‌ 11(జ‌నంసాక్షి): మహాత్ముల అడుగు జాడల్లో ప్రతి ఓక్కరు నడవాలని అప్పుడే దేశం, రాష్ట్రం సమగ్రాబివృద్ది సాద్యమవుతుందని జిలా రెవెన్యూ అధికారి శ్యాంప్రసాద్‌ లాల్‌ పేర్కోన్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 129వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డీఆర్‌ఓ పూల మాలవేసి నివాళులర్పించారు.
ఈసందర్బంగా  డీఆర్‌ఓ ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి  మాట్లాడుతూ ఆజాద్‌ దేశానికి తోలి విద్యాశాఖమంత్రిగా విద్యాభివృద్దికి కృషి చేసిన సేవలు మరువలేనివన్నారు. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని జైలు శిక్షను అనుభవించిన గొప్ప వ్యక్‌ఇ ఆజాద్‌ అన్నారు. వారి జీవితం దేశప్రజల్లో ఎప్పుడు స్పూర్తి నింపుతూనే ఉంటుందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆజాద్‌ దేశ సమైక్యతకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ మామిండ్ల దశరథం, ఎఓ గంగయ్య, సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.