మహారాష్ట్ర నుంచి కొనుగోళ్లు..అక్రమంగా నిల్వలు

share on facebook

మద్దతు ధరలు ఎక్కువ ఉండడంతో వ్యాపారుల ప్లాన్‌
ఆదిలాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో కంది పంటకు క్వింటాకు రూ.4500కు మించడం లేదు. జిల్లాకు చెందిన కొందరు దళారులు పక్కరాష్ట్రం నుంచి పంటను కొనుగోలు చేసి పలుచోట్ల నిల్వ చేశారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించేందుకు దళారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండ్రోజుల కిందట జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్‌ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన వంద క్వింటాళ్ల కందులను అధికారులు సీజ్‌ చేశారు. అక్రమ నిల్వలపై నిఘా పెట్టి ఆకస్మిక దాడులు నిర్వహిస్తామని ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా కందుల అక్రమ నిల్వలపై ప్ర త్యేక దృష్టి సారించామని జాయింట్‌ కలెక్టర్‌  కె.కృష్ణారెడ్డి తెలిపారు.  ఇందుకోసం పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.  పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ నిల్వలపై దృష్టి సారించిన అధికారులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు జిన్నింగ్‌లో నిల్వచేసిన 100 క్వింటాళ్ల కందులను స్వాధీనం చేసుకున్నారు.  కందులను అక్రమంగా నిల్వచేసిన వారిని గుర్తించి వారిపై క్రి మినల్‌ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సైతం రైతులు తీసుకువచ్చిన పంటను మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.  జిల్లాలో కంది కొనుగోళ్లు ప్రారంభమైనందున అధికారులు అక్రమ నిల్వలపై నిఘా పెంచారు. జిల్లా వ్యాప్తంగా ఈ సారి కంది పంట దిగుబడులు అధికంగా ఉండడంతో బహిరంగ మార్కెట్‌లో దళారులు రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో సైతం కంది పంటకు ధర లేకపోవడంతో అక్కడి నుంచి సైతం జిల్లాలో వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన కందులను అధిక ధరలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు. కందులను రైతులు తక్కువ ధర క్వింటాకు రూ.4700 వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భారీగా పంటను నిల్వచేశారు. కందుల అక్రమ నిల్వలపై అధికారులు దృష్టి సారించారు.ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో సకాలంలో వర్షాలు కురవడం, వాతావరణం సైతం కంది పంటకు  అనుకూలిం చడంతో పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది కంది క్వింటాకు రూ.5450 కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాది క్వింటాకు రూ.5050 ఉండగా ఈ సారి రూ.400 ధర పెరిగింది. పంట దిగుబడులు ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతులు నష్టపోకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 2 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడు వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు ఏర్పాట్లు చేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఈసారి 8 కేంద్రాల్లో కందిని కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు.జిల్లాలోని ఆదిలాబాద్‌, జైనథ్‌, ఇ చ్చోడ, బోథ్‌, ఇంద్రవెల్లి, నార్నూర్‌, గుడిహత్నూ ర్‌, బేలలో పంటను కొనుగోళ్లును ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో రైతులు మాత్రమే పంటను విక్రయించేలా అధికారులు ముందస్తు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ బృం దాలు అక్రమ నిల్వలపై దృష్టి సారిస్తాయి. వీరితో పాటు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సైతం దళారులు నిల్వచేసిన కందులను స్వాధీనం చేస్తారు.

Other News

Comments are closed.