మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య మృతి

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణ సిపిఐ సీనియర్‌ నేత , మాజీ ఎమ్మెల్యే దేశిన చినమల్లయ్య స్వర్గస్థులయ్యారు. కరీంనగర్‌ జిల్లా ఇందుర్తి నుంచి గతంలో ఆయన నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యరు. భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన ఆయన గెలుపొందడం విశేషం. వెనుకబడిన తరగతులకు చెందిన చినమల్లయ్య కొంతకాలంగా అస్వస్థలుగా ఉన్నారు. బలహీనవర్గాల సమస్యలపై ఆయన పలు పోరాటాలు చేశారు. ఇందుర్తి మాజీ శాసనసభ్యుడు దేశిని చిన్న మల్లయ్య(87) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన పూర్వపు కరీంనగర్‌ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐదు దశాబ్దాలపాటు సీపీఐలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2000 సంవత్సరంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెరాస పార్టీ ఆవిర్భావంలో కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. రాష్ట్ర కల్లుగీత కార్మికుల సంఘం వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ జీవితం గడిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన 1957-1978 వరకు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామసర్పంచిగా 21 సార్లు ఎన్నికయ్యారు. 1978లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు.

Other News

Comments are closed.