మార్కెట్‌ అభివృద్ధికి కృషి చేస్తా

share on facebook

జైనథ్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రైతులందరికీ అందుబాటులో ఉంటూ.. అభివృద్ధికి కృషి చేస్తానని జైనథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ముక్కెర ప్రభాకర్‌ పేర్కొన్నారు. బుధవారం జైనథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన ఛైర్మన్‌గా ముక్కెర ప్రభాకర్‌, వైస్‌ ఛైర్మన్‌గా మినక సుధాంరెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఛాంబర్‌లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వీరితో పాటు పాలకవర్గ సభ్యులుగా బింగి పోతన్న, పెందూర్‌ భారత్‌, ఎస్‌.కె.మహ్మద్‌, మాలేకర్‌ వసంత్‌, సాకర్‌కార్‌విలాస్‌, గుర్నులే రుకుంబాయి, పుల్లుర్‌వార్‌ మనోహర్‌, ప్రకాశ్‌ పవార్‌లను ఏడీఏం శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభాకర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి కట్టబెట్టినందుకు మంత్రి జోగు రామన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌తో పాటు వైస్‌ ఛైర్మన్‌, పాలకవర్గ సభ్యులను రాష్ట్ర డెయిరీ సంస్థ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ మనోహర్‌, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్దన్‌రెడ్డి శాలువాలు కప్పి పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో బేల ఎంపీపీ, రఘుకుల్‌రెడ్డి, నాయకులు త్లలెల చంద్రయ్య, సర్సన్‌ లింగారెడ్డి, పెందూర్‌ దేవన్న, గడ్డం పోతారెడ్డి, గణెళిష్‌ యాదవ్‌, గంభీర్‌ థాక్రే, మస్కే తేజారావు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఏఓ వివేక్‌, వ్యవసాయ కార్యదర్శి మధూకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Other News

Comments are closed.