మిరుదొడ్డి మండల తాహశీల్దారుగా ఎస్ కె.ఆరిఫా

share on facebook

మిరుదొడ్డి,అక్టోబర్ 23(జనంసాక్షి)మిరుదొడ్డి మండల తాహశీల్దారుగా ఎస్ .కె ఆరిఫా మంగళవారం రోజున భాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన శ్రీనివాసరావు తాడ్వాయి మండలం బదిలి కాగా,కోహెడ మండల తాహశీల్దారుగా పని చేసిన ఎస్ .కె ఆరిఫా మిరుదొడ్డి మండల తాహాశీల్దారుగా మంగళవారం రోజున భాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లడుతూ ఎన్నికల దృష్ట్య మండల పరిధిలోని ఒటర్ల జాబాతాల వివారాలు వీఆర్వోలను అడిగి తెలుసుకున్నారు.మండల పరిధిలో 41పోలింగ్ స్టెషన్లు ఉండగా,29వేల 8వందల ఇరవై ఐదు మంది ఓటర్లు ఉన్నాట్లు తెలిపారు.ఓటర్ జాబితాలో ఎవైన పోరపాట్లు ఉంటే  పారదర్శకంగా పరిశీలించి సవరణ చేయాలని సూచించారు.దివ్యాంగులందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేస్తామన్నారు.అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేసి పోలింగ్ రోజు ఉచిత ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా పోలింగ్ స్టేషన్లకు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు.రైతుబంధు పథకం రెండో విడత (రబీ సీజన్‌) అమలుకు రంగం సిద్ధమైనందున రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.4 వేల చొప్పున  జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
రైతులకు రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతలలో జమ చేస్తున్నందున రైతులు పట్టదారు పాసు పుస్తకాల,బ్యాంక్ ఖాత నంబర్లు నమోదు చెయడానికి రైతులందరు వ్యవసాయధికారులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్ ,వీఆర్వోలు యన్ .నాంపల్లి,ఎం శ్రీనివాసరావు,జె.నర్సింలు,యన్ .నర్సింలు,బి.నర్సింలు,పి.నాగెష్ ,సివో రాజు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.

Other News

Comments are closed.