మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి పాస్టర్ల సంఘం మద్దతు:-

share on facebook

మిర్యాలగూడ. జనం సాక్షి జిల్లా ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నా ఏర్పాటుకు నోచుకోని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి పాస్టర్ ల సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు ధీరావత్ హన్య నాయక్ తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడలో జరిగిన పాస్టర్ల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడ నాగార్జునసాగర్ హుజూర్నగర్ నియోజకవర్గాలలో 400 మంది పాస్టర్లు ఉన్నారని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి వారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మిర్యాలగూడ జిల్లాగా ఏర్పడితే అన్ని రకాల సౌకర్యాలు మిర్యాలగూడ కు రావడం తో పాటు జిల్లా కార్యాలయాలు మిర్యాలగూడ అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతోపాటు అన్ని రకాల ఆందోళనలో పాల్గొంటామని అన్నారు. జిల్లా ఏర్పాటు కావాలని కోరుతూ, పాలకుల మనసు మార్చాలని కోరుతూ చర్చిలలో ప్రార్థనలు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఫాస్టర్ జనార్ధన్, జిల్లా ఏర్పాటు ఉద్యమ నాయకుడు బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, కస్తూరి ప్రభాకర్ డాక్టర్ జాడి రాజు బంటు వెంకటేశ్వర్లు చేగొండి మురళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

 

Other News

Comments are closed.