ముందస్తుకు సిద్ధంమవ్వండి

share on facebook

– సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి
– కోర్టు కేసులకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు
– పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి
– బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం
– కేంద్రం మద్దతు ధరకు బోనస్‌ ఇచ్చి కొనుగోళ్లు చేస్తాం
– నిరుద్యోగ భృతి అందిస్తాం
– ఎన్నికలు వస్తున్నాయనే ప్రధాని మోదీ, కేసీఆర్‌లు రైతుజపం చేస్తున్నారు.
– టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశముందని, శ్రేణులు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై తప్పిదాలను ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కోర్టుల్లో కేసులకు, కాంగ్రెస్‌కు సంబంధంలేదని చెప్పారు.  ముందస్తు ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధొంగా ఉందన్నారు. ఇప్పటికే సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయని, ప్రజలంతా కాంగ్రెస్‌ వైపే ఉన్నారని అన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం తప్పిదాలు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. కోర్టు కేసులకు, కాంగ్రెస్‌ పార్టీకి సబంధం లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసిన ఉత్తమ్‌, బీసీలకు న్యాయం చేయాలన్నారు. ఎన్నికలు దగ్గరపడ్డాయనే సీఎం కేసీఆర్‌, పీఎం మోడీ రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చేది  కాంగ్రెస్‌ ప్రభుత్వమే మన్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా బోనస్‌ ఇచ్చి ధాన్యం కొంటామని ఉత్తమ్‌ హావిూ ఇచ్చారు. క్వింటా వరికి రూ. 2000, పత్తికి రూ. 6000, సోయాబీన్‌కు రూ. 3500, కందులకు రూ. 7000, మిర్చి రూ. 10 వేలు, పసుపు రూ. 10 వేలు, ఎర్రజొన్న రూ. 3 వేలకు తక్కవ కాకుండా కొంటామని తెలిపారు. దగా లేకుండా మార్కెట్‌ కి వచ్చే ప్రతీ గింజ కొటామని ఉత్తమ్‌ ప్రకటించారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోస్తామన్నారు. ఇక రైతు బీమా కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే కడుతోందన్నారు. సర్వేలు అన్ని కాంగ్రెస్‌ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని… వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే నని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు అన్నిరకాల అన్యాయం చేస్తున్నారని విమర్శించిన పీసీసీ చీఫ్‌… కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఇప్పటివరకు ఖాళీలు భర్తీ చేయలేదని… నిరుద్యోగులంతా కేసీఆర్‌ ప్రభుత్వానికి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మేం అధికారంలోకి వస్తున్నామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్‌ ప్రకటించారు.

Other News

Comments are closed.