ముందస్తుతో సవాల్‌ విసరనున్న కెసిఆర్‌

share on facebook

అభివృద్ది నినాదంతో ముందుకు వెళుతున్న సిఎం కెసిఆర్‌ ఇప్పుడు ముందుగానే ఎన్నికలకు కూడా వెళ్లడం దాదాపు ఖాయమయ్యింది. అనేక పరిస్థితులు అంచనాలు వేశాక ఓ ఐదారు నెలల ముందు ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోమారు అధికారం ఖారు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బాగా వెల్లాయి. ప్రజలు సానుకూల ధోరణిలో ఉన్నారు. ఈ దశలో ఎన్‌ఇనకలకు వెళితే ప్రతిపసక్షాలకుఅ వకాశం లేకుండా చేయాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత నాలుగున్నరేళ్ల కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారనే చెప్పాలి. ఆశలను కల్పించడం వేరు.. వాటిని సాకారం చేయడం వేరు. తెలంగాణ కలను సాకారం చేసిన వ్యక్తిగా ధీరోదాత్త నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హావిూని సాకారం/- చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు భాగస్వాములైతే తెలంగాణ పురోభివృద్దిలో కీలకం కానుంది. ఇక మరో విశేషమేమంటే సమైక్య రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక పథకాలను,చట్టలాను మార్పు చేసుకుంటే తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా సాగడం అన్నది కెసిఆర్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది అమలైన వాటిలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ముఖ్యమైనవి. ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగనుంది. దేశానికి ఈ పథకం ఆదర్శం కాబోతున్నది. ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. స్వాతంత్య్ర వచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 31 జిల్లాలో చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది. తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపటల రూపు రేఖలను మార్చి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు కొత్త అర్థం చెప్పారు. చెప్పడమే కాదు చేసి చూపారు. పేదలు కూడా గౌరవంగా బతికేలా చేశారు. రెండు పడకగదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. తమకూ అటువంటి ఇళ్లు రాబోతున్నయన్న ఆనందంలో ఉన్నారు. రానున్న కాలంలో ఈ కలను సాకారం చేస్తామన్న హావిూ ఇప్పుడు పేదలకు సంజీవినిగా మారింది. ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల నిరమాణాలు జోరుగా సాగుతున్నాయి. తఉద్యోగాల భర్తీ పక్రియనూ సర్కారు వేగవంతం చేసింది.ఒకేసారి 21కొత్త జిల్లాలు ఏర్పాటై మొత్తం 31 జిల్లాలతో అలరారుతున్న తెలంగాణ కోటి రతనాల వీణగా భాసిల్లాలంటే అందుకు కావలసిన సంకల్పబలం సమకూర్చుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి కూడా ఎన్నో ఉన్నాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ కానుంది. ఇది పక్కాగా అమలయితే,అధికారులు,ఇదే సందర్భంలో గతంలో పెండింగ్‌లోఉన్న ఇందిరమ్మ ఇళ్ల బకాయిలకు సంబంధించి 3వేల కోట్ల పైచిలుకు బకాయిలను ఒక్క మాటతో అసెంబ్లీలో రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఇది లక్షల మంది పేదలకు ఊతమిచ్చే అంశగా చెప్పుకోవాలి. ఈ దశలో మిషన్‌ భగీరథ మాదిరిగా ఇళ్ల నిర్మాణాలనూ పెద్ద స్ధాయిలోచేపట్టాల్సిన అవసరం ఉంది. చేస్తానని ఖచ్చితంగా ప్రకటించారు. నదులు, రిజర్వాయర్లనుంచి నేరుగా పైపులైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ మంచినీటిని అందజేయడం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ కింద భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రూపు పరీక్షలు ముందుకు వచ్చాయి. ఇలా అనేక అంశాల్లో కీలక నిర్ణయాలు.. అనేకన్నా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత కేవలం సిఎం కెసిఆర్‌దని పేర్కొనాలి. ఈ యేడు సిఎం కెసిఆర్‌ తనదైన ప్రత్యేకతను చూపారు. ఇక గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. ఈ స్ఫూర్తి కొత్త సంవత్సరానికి టానిక్‌ కానుందనడంలో సందేహం లేదు. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే ధైర్యం,స్థయిర్యం ఉన్న సిఎంగా కెసిఆర్‌ ముందుకు సాగుతున్న వేళ ముందస్తుకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పథకాలు బాగా అమలవుతున్న వేళ ఎందుకీ తొందర అనేవాళ్లు ఉన్నారు. అయితే ప్రజల ఆలోచన ఎప్పుడూ ఒకేలా ఉండది. అందుకే వారు ఫలితాలు అనుభవిస్తున్న తరుణంలోనే ఓటుబ్యాంకును రాబట్టుకోవాలి. ఇకపోతే కేంద్రంతో కలసి ఒకేసారి ఎన్‌ఇనకలకు వెళ్లడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఎంపి ఎన్నికలతో పాటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ప్రగతినివేదన సభ ద్వానా సత్తా చాటి ప్రతిపక్షాలకు సవాల్‌ విసరబోతున్నారు.

 

Other News

Comments are closed.