ముజ్రాపార్టీ నిర్వాహకుల అరెస్ట్‌

share on facebook

రంగారెడ్డి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు యువతులు, 11 మంది యువకులున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబైకి, మిగిలిన ముగ్గురు హైదరాబాద్‌ కు చెందినవారిగా గుర్తించారు. యువకులంతా హైదరాబాద్‌ పాతబస్తీకి చెందినవారు. వారి నుంచి 25,240 రూపాయల నగదుతో పాటు రెండు ఇన్నోవా కార్లు, ఓ బైక్‌, 26 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అందరిని కేశంపేట పోలీసులకు అప్పగించారు. సాజిదా ఫామ్‌ హౌజ్‌ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు.

 

Other News

Comments are closed.