ముషీరాబాద్‌లో పాగా వేస్తా: లక్ష్మణ్‌

share on facebook

హైదరాబాద్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ముషీరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల మద్దతు తనకు ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. మరోమారు ఇక్కడ విజయం సాదిస్తానని అన్నారు. రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. తమకు నాయకత్వ కొరత లేదని ఆయన అన్నారు. సోమవారం మొదటి నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ తాను నామినేషన్‌ దాఖలు చేసిన సందర్బంగా ముషీరాబాద్‌ నుంచి ప్రజలు స్వచ్చంధంగా ర్యాలీగా వచ్చారని అన్నారు. అన్నీ వర్గాల ప్రజలు వచ్చారంటే ఇది తన గెలుపుకు బాట అన్నారు. తన గెలుపు అవసరమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, తన సేవలు ఈ రాష్టాన్రికి అవసరమని మోదీ, అమిత్‌ షా కూడా భావించారన్నారు. ప్రజలు తనకు వెన్నుదన్నుగా ఉన్నారని, ప్రజల ఆశీస్సులతోనే తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

Other News

Comments are closed.