మూడో సారి గిన్నిస్‌ రికార్డును సృష్టించిన షియోవిూ

share on facebook

బీజింగ్‌,డిసెంబర్‌25(జ‌నంసాక్షి):మైబైల్స్‌ తయారీదారు షియోవిూ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన యానిమేటెడ్‌ మొబైల్‌ ఫోన్‌ మొజాయిక్‌ను ఏర్పాటు చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో  మరోసారి చోటు దక్కించుంకుంది.తాజాగా చైనా మార్కెట్‌లో ఎంఐ ప్లే స్మార్ట్‌ఫోన్‌ విడుదల సందర్భంగా షియోవిూ ఈ ఫీట్‌ను సాధించింది. ఇప్పటికే షియోవిూ రెండు సార్లు గిన్నిస్‌ రికార్డు సాధించిన విషయం విదితమే. సెప్టెంబర్‌ నెలలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లైట్‌ మొజాయిక్‌ లోగోను షియోవిూ క్రియేట్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించగా, నవంబర్‌ నెలలో ఒకేసారి 500 ఎంఐ స్టోర్స్‌ను ఏకకాలంలో ప్రారంభించి షియోవిూ గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఆ తరువాత మరోసారి ఇప్పుడు ఆ కంపెనీ మళ్లీ గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఈ రికార్డు షియోవిూకి మూడవది కాగా, తాజాగా జరిగిన ఈ ఫీట్‌ ఈవెంట్‌కు షియోవిూ సీఈవో లెయ్‌ జున్‌ హాజరై గిన్నిస్‌ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కాగా ఆ యానిమేటెడ్‌ మొబైల్‌ ఫోన్‌ మొజాయిక్‌ను ఏర్పాటు చేసేందుకు గాను షియోవిూ సిబ్బంది మొత్తం 1008 మొబైల్‌ ఫోన్లను ఉపయోగించారు. అంతకు ముందు పలు కంపెనీలు 504 మొబైల్‌ ఫోన్లతో గిన్నిస్‌ రికార్డును సాధించగా, ఇప్పుడు షియోవిూ అంతకు రెట్టింపు సంఖ్యలో మొబైల్స్‌తో రికార్డు సృష్టించింది. ఇక ఈ మొజాయిక్‌ను ఏర్పాటు చేసేందుకు రెండు వారాల సమయం పట్టగా, దీని పొడవు 7.9 విూటర్లుగా నమోదైంది. క్రిస్మస్‌ ట్రీ, శాంటా క్లాజ్‌ల రూపాలతో ఈ మొజాయిక్‌ను తీర్చిదిద్దారు.

Other News

Comments are closed.