మెట్టుదిగిన జేఏసీ

share on facebook

– విలీనం డిమాండ్ పక్కన పెడతాం

– ప్రకటిచిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్,నవంబర్ 14(జనంసాక్షి): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఈయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదని, అరెస్టు చేసిన ఆర్టీసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోర్టుతో పాటు ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు . కార్మి కులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.” హైకోర్టు సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని కోర్టు చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కార్మికుల | ఆత్మహత్యలపై ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ | ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా వెంటనే స్పందించాలి . రాష్ట్రంలో 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తే | వెనుకబడిన వర్గాల ప్రజలు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 20 మంది కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం. ఆర్టీసీని రక్షించాలంటూ రేపు బైక్ ర్యాలీ నిర్వహిస్తాం . నాతో పాటు నలుగురు నేతలు హైదరాబాద్లో 18న దీక్ష చేస్తారు. 11, 18న డిపోల వద్ద కార్మికుల సామూహిక దీక్ష, 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తాం ‘ అని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు . ఆ అనర్హులు భాజపా గూటికి..

Other News

Comments are closed.