మెరిసిన రహానే-పంత్‌ జోడి

share on facebook

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్‌ క్రీజులో కుదురుకుంది. రహానె, పంత్‌ ఇద్దరూ అర్ధ సెంచరీలు చేశారు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా వీరిద్దరూ విండీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. క్రీజులో ఉన్న రహానె(51; 122 బంతుల్లో, 4×4), రిషబ్‌ పంత్‌(56; 76బంతుల్లో, 9×4)లు భారత్‌ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 65ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

Other News

Comments are closed.