మేకల మందపై చిరుత దాడి.. 20 మృతి

share on facebook

రంగారెడ్డి : యాదాద్రి భువనగిరి శివారు ప్రాంతం సంస్థాన్ నారాయఫురం మండలం రాచకొండ గ్రామపంచాయతీ కడీలబాయి తండా సమీపంలో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడిలో 20 మేకలు మృతి చెందాయి. మేకల యజమాని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిరుత సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుందని.. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు, స్థానికులు తెలిపారు.

Other News

Comments are closed.