మైసమ్మ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ

share on facebook

వెల్గటూర్‌, నవంబర్‌ 18,(జనం సాక్షి):వెల్గటూర్‌ మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో గొల్ల యాదవ కులస్తులు, గొర్ల, మేకల వ్యాపారస్తుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల క్షేమానికై నిర్వహించిన అంగడి మైసమ్మ కార్యక్రమానికి ఎంపీపీ పోనుగోటి శ్రీనివాస్‌రావు హాజరైనారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు, మహిళలు, యువకులు ఎంపీపీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సత్యం, అధికార ప్రతినిధి పత్తిపాక వెంకటేష్‌, వ్యాపార సంఘ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గన్నారు.

 

Other News

Comments are closed.