మైసూరు ఫుడ్‌ టెక్నాలజీ యూనిట్‌తో ఒప్పందం

share on facebook

కలసి పనిచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం

అక్కడి విధానాలు బాగున్నాయన్న మంత్రి పోచారం

హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుండి వ్యాల్యు ఆడెడ్‌ ప్రోడక్ట్స్‌ తయారుచేసి మరింత విలువను జోడించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్జనాన్ని అందించి, తెలంగాణ రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇనిస్ట్యూట్‌ అంగీకారం తెలిపింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి నేతృత్వంలోని బృందం మైసూర్‌ లోని కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్‌ ను ఏర్పాటు చేయాడానికి మంత్రి పొచారం నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నుండి బైప్రోడక్ట్స్‌ తయారు చేయడంలో పేరెన్నికగన్న సంస్థ అఈ/ుఖీఎ. ఒక్కరోజు పర్యటనలో బాగంగా మైసూర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర బృందం పలు ఉత్పత్తులలో తయారి, నిల్వ, మార్కెట్‌ లో అవకాశాలను పరిశీలించింది. ముందుగా కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర బృందానికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం మొదట పైలెట్‌ ప్లాంట్‌ ను సందర్శించిన బృందం అక్కడ దోశ, చపాతి, ఇడ్లీని యంత్రాల ద్వారా తయారు చెసే విధానాన్ని పరిశీలించారు. వేరుశనగ విత్తనాలను వేయించే, ప్యాకింగ్‌ చెసే యంత్రం ప్రత్యేకతను అధికారులు వివరించారు. మొక్కజొన్న నుండి బిస్కెట్లు, కుకీస్‌, పౌడర్‌ వంటి ఉత్పత్పుల తయారు, ప్యాకింగ్‌ ను పరిశీలించారు. పసుపు ప్రాసెసింగ్‌ టెక్నాలజీపై రాష్ట్ర బృందం అధిక ఆసక్తిని కనబరిచింది. పసుపు నుండి వంట కోసం వాడే పౌడర్‌ తో పాటు పారిశ్రామిక అవసరాల కోసం కర్కుమిన్‌, పోలేయారెజిన్‌ వంటి ఉప ఉత్పత్తులను తయారు చేయడం వలన రైతులకుఅధిక లాభాలు వస్తాయని అఈ/ుఖీఎ అధికారులు వివరించారు. మాములు పద్దతులలో పసుపును పౌడరుగా మార్చడానికి 45 రోజుల సమయం అవసరం అవుతుండగా అభివృద్ధి చేసిన టెక్నాలజితో కేవలం ఎనిమిది (8) గంటలలోనే పౌడరుగా మార్చవచ్చు. రోజువారి గృహాలలో నిత్యం వాడే అల్లం, వెల్లుల్లి మిశ్రమానికి తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలలో డిమాండ్‌ అధికంగా ఉన్నది. ఈ మిశ్రమంలో కల్తీ నివారణకు తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలతో గ్రామాలలోనే తయారుచేయించి స్థానికంగానే అమ్మకాలు చేయించడం ద్యారా నాణ్యతతో పాటు, తక్కువ ధరలోనే వినియోగదారులకు దొరికే విదంగా ప్రోత్సహించాలని భావిస్తుంది. ఈ పద్దతిలో రైతులకు మార్కెటింగ్‌ సమస్య ఉండదు, ధర ఎక్కువగా లభిస్తుంది. ఈ అల్లం,వెల్లుల్లి తయారికి, ప్యాకింగ్‌ కు అవసరమైన సాంకేతికతను అఈ/ుఖీఎ అభివృద్ధి పరిచింది. తక్కువ ధరతో చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు బృందానికి వివరించారు. అల్లం, వెల్లుల్లి, పసుపు కొమ్ములను ముక్కలుగా కత్తిరించే యంత్రం కూడా అభివృద్ధి చేసినందున తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో ఈ అల్లం, వెల్లుల్లి పరిశ్రమను స్థాపించుకోవచ్చని అధికారులు తెలిపారు.అదేవిదంగా అభివృద్ధి చేసిన ప్రోటీన్‌ టెక్నాలజి డిపార్ట్‌మెంట్‌ లో సోయాబిన్‌ ప్రాసెసింగ్‌, నువ్వుల పేస్ట్‌, షుగర్‌ కేన్‌ జ్యూస్‌ తయారి, మిరియాలు, ధనియాలను పౌడరుగా మార్చి ప్యాకింగ్‌ చెసే యంత్రాలను పరిశీలించారు. పండ్లు, కూరగాయల సాంకేతిక అంశాలలో టమాట నుండి సాస్‌, సూప్‌, బంగాళదుంపలను డ్రైయింగ్‌, చిప్‌ గా తయారు చేయడం పరిశీలించారు. నేటి ఆధునీకతకు అనుగుణంగా, వినియోగదారులకు సమయం వృధా కాకుండా ఉండటం కోసం బీన్స్‌, క్యారెట్‌ లను ముక్కలుగా చేసి, ప్యాకింగ్‌ చేసి రెడీ టూ యూజ్‌ పద్దతిని పరిశీలించారు. పండ్ల నుండి జ్యూస్‌ ల తయారి, ప్యాకింగ్‌, ఎక్కువ కాలం నిల్వ ఉంచే పద్దతులను శాస్త్రవేత్తలు వివరించారు. తదుపరి రాష్ట్రంలో పండుతున్న పంటలు, విస్తీర్ణం, ఉత్పత్తి, వినియోగం, మార్కెటింగ్‌ వంటి అంశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్ధసారది వివరించారు. రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తుల నుండి బైప్రోడక్ట్స్‌ తయారు చేయడం వలన రైతులకు మేలు జరిగి అదనపు ఆధాయం సమకూర్చడంతో పాటు వినియోగధారులకు నాణ్యమైన ఆహార పదార్దాలు అందించడమే తమ ప్రభుత్వ ద్యేయమని మంత్రి పొచారం తెలిఅక్కడి అధికారులు రాష్ట్ర బృందానికి తెలిపారు. త్వరలోనే తమ శాస్త్రవేత్తలు, అధికారులతో కూడిన బృందం తెలంగాణలో పర్యటనకు వస్తామన్నారు. రాష్ట్ర బృందంలో గుత్తా సుఖేందర్‌ రెడ్డి, జయేష్‌ రంజన్‌,సి. పార్ధసారది ,యల్‌. వెంకట్రామిరెడ్డి, శ్రీమతి లక్ష్మీబాయి కె. వనజాత, జి. అఖిల్‌ కుమార్‌ గవార్‌, ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, అధికారులు ఉన్నారు.

 

 

Other News

Comments are closed.