మొక్కలు విరివిగా నాటాలి

share on facebook

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. హరితహారం వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యన్నారు.  ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలనే కార్యక్రమం  చేపట్టామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో  చేస్తున్న కృషి ప్రతీ ఒక్కరికీ ఆదర్శప్రాయంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ పుట్టిన రోజున మొక్కలు నాటే సంప్రదాయాన్ని ఆనవాయితీగా మొదలు పెడితే పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.

Other News

Comments are closed.