మొబైల్ షాప్‌లోఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం

share on facebook

నల్లగొండ : నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని మొబైల్ షాపులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పూలసెంటర్‌లోని ఓ మొబైల్ షాపులో ఆకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.  ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

పైరింజన్లలో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని షాప్ యజమాని తెలిపాడు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *