మోడీ అద్భుతమైన నాయకుడు

share on facebook

దేశాన్ని ముందుకు నడపాలన్న నిరంతర తపన ఆయనది: సోము
విజయవాడ,జూలై30 (జనం సాక్షి) : ప్రధాని మోడీ అద్భుతమైన నాయకుడని, దేశ ప్రగతి కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నేతని బిజెపి నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఆయన నిరంతరం దేశాన్ని బాగుచేయడమెలా, ఈ దరిద్రాన్ని వదిలించడం ఎలా అని ఆలోచిస్తున్నారని అన్నారు. అలాంటి సమయంలో మనమంతా కూడా ఆయనకు చేదోడువాదోడుగా ఉండాలని పునరుద్ఘాటించారు. రాజకీయాల్లో ఉండే చాలా మంది వ్యక్తులు తమ కుటుంబాల్లోని రాజకీయ నాయకులు ద్వారా వచ్చినవారేనని, కానీ  బిజెపిలో వంశపారంపర్యంగా వచ్చినవారు తక్కువన్నారు. తామ  మాత్రం క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగామని తెలిపారు. భారత శక్తి ఏమిటో ప్రధాని మోదీ ప్రపంచానికి తెలియజెప్పారని అన్నారు. జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దీర్ఘకాలిక సుఖాల కోసం స్వల్పకాలిక కష్టాలు తప్పవన్నారు. అతి సామాన్యుడికి ప్రధాని  స్థాయికి తెచ్చిన పార్టీ బిజెపి అని అన్నారు.  మోదీ భారత్‌ శక్తిని ప్రపంచానికి తెలిపారని, ఈ దేశానికి మోదీ అవసరం చాలా ఉందన్నారు.
గ్రావిూణ రహదారులకు మహర్దశ పట్టడంలో ఎన్డీఎ చిత్తశుద్దితో పనిచేస్తోందిన అన్నారు.

Other News

Comments are closed.