యాదవులు ఐక్యతతో సాగాలి

share on facebook

ఆసిఫాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పిల్లల చదువులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు యాదవ్‌ సూచించారు. విద్యాపరంగా ఎదిగితే ఉపాధి అవకాశాలు మెరుగై ఆర్థికంగా బలపడవచ్చని ఉదహరించారు. రాజకీయంగా బలపడితే హక్కుల రక్షణతో పాటు ప్రత్యేకంగా నిధులు పొంది కులస్థుల అభ్యున్నతికి పాటుపడవ చ్చన్నారు. సంఘపటిష్టతకు సమష్టితత్వం ముఖ్యమని, అందుకు పార్టీలకతీతంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆడినోటిఫై ట్రైబల్‌(డీఎన్‌టీ) గా జీవో పునరుద్ధరణ, గొర్రెలు, మేకల కాపరులకు మేత కోసం అడవిలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ప్రమాద బీమా కింద రూ.5 లక్షల నష్ట పరిహారం, యాదవుల అభ్యున్నతికి ప్రత్యేక నిధుల కేటాయింపు, యాదవుల్లోని ఉపకులాలన్నీ కలసిపోయి సంబంధ బాంధవ్యాలు నెరపాలని సమావేశంలో తీర్మానాలు చేశారు.

—–

 

Other News

Comments are closed.