యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్

share on facebook
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. మరికాసేపట్లో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం యాదాద్రి పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడ త్వరలో నిర్వహించే మహాసుదర్శన యాగంపై కూడా సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

దాదాపు రెండువేల కోట్ల ప్రాథమిక అంచనావ్యయంతో ప్రారంభించిన నిర్మాణపనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. ఆలయం లోపల ఆళ్వార్ల విగ్రహాలు, ఆంజనేయస్వామి ఆలయం, 28 అష్టభుజి నిర్మాణాలు వాటిపై విమానాల నిర్మాణం పూర్తయింది. సప్త గోపురాలు సిద్ధమయ్యాయి. బ్రహ్మోత్సవ మండపంతో కలిపి ప్రధానాలయం నిర్మాణం 4.35 ఎకరాల్లో జరుగుతున్నది. కొండపైన నిర్మాణమవుతున్న ప్రధానాలయ పనులపై సీఎం కేసీఆర్ హోటల్ హరితలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

Other News

Comments are closed.