రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

share on facebook

జైపూర్‌లోని కిషన్‌పురాలో ఓటేసిన 105ఏళ్ల బామ్మ
ఓటేయడానికి వచ్చి ప్రమాదంలో గాయపడ్డ దంపతులు
జైపూర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి):  రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది.  మొత్తం 199 నియోజకవర్గాలకు గానూ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 20.9శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి గంటల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు. కొన్ని చోట్ల ఈవీఎం సమస్యలు తలెత్తాయి. జలోర్‌ నియోజకవర్గంలోని అ¬ర్‌లో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో అధికారులు కొంతసేపు ఓటింగ్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో అసహనానికి గురైన ఓటర్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహం కనబరుస్తున్నారు. దుంగార్‌పూర్‌ జిల్లాకు చెందిన ఓ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. అయినప్పటికీ ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి కట్లతోనే పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటేశారు. జైపూర్‌లోని కిషన్‌పురాలో 105ఏళ్ల బామ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న బామ్మను ఆమె కుటుంబసభ్యులు ఎత్తుకుని పోలింగ్‌ కేంద్రానికి తీసుకొచ్చారు. జాతీయ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న రాజస్థాన్‌ ఎన్నికల్లో ఈసారి మరో ప్రత్యేకత చోటుచేసుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 187 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి పోటీచేస్తున్న మహిళలే 50 మంది వరకు ఉన్నారు. గతపదేళ్లలో ఇంతమంది మహిళలు పోటీలో ఉండడం ఇదే తొలసారి. అయితే దాదాపు 83 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క మహిళకు కూడా నామినేషన్‌ వేసే అవకాశం రాకపోవడం గమనార్హం.
952లో రాజస్థాన్‌లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు మొదలు… మొత్తం అభ్యర్థులతో పోల్చితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2008లో ఇది 7 శాతం ఉండగా.. 2013లో 7.9 శాతం, 2016లో 8.3 శాతం మంది మహిళా అభ్యర్థుల ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ లెక్కన ఇది
20 శాతానికి చేరాలంటే కనీసం 90 ఏళ్లు పడుతుందని అంచనా. ఇక మహిళలు పురుషులకు సమాన సంఖ్యలో పోటీచేసే పరిస్థితి రావాలంటే మరో 315 ఏళ్లు వేచిచూడక తప్పదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

Other News

Comments are closed.