రాజస్థాన్‌లో ఫ్రెంచ్‌ యువతి అదృశ్యం

share on facebook

జైపూర్‌, జూన్‌14 (జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఫ్రెంచ్‌ యువతి అదృశ్యమైంది. ఆమె అదృశ్యమై రెండు వారాలు అవుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. యువతి ఆచూకీ కోసం రాజస్థాన్‌ పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన గేలి చౌట్యూ(20) మే 30న పుష్కర్‌లోని హాలీ కా చౌక్‌లోని ఓ ¬టల్‌లో బస చేసింది. అయితే జూన్‌ 1న పుష్కర్‌ నుంచి జైపూర్‌కు బయల్దేరే క్రమంలో అదృశ్యమైంది. చౌట్యూ అదృశ్యమైన విషయాన్ని ఇండియాలోని ఫ్రాన్స్‌ అంబాసిడర్‌ అలెగ్జాండర్‌ జిగ్లేర్‌ ట్విట్టర్‌ ద్వారా రాజస్థాన్‌ పోలీసులకు తెలిపారు. యువతి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ట్వీట్‌పై రాజస్థాన్‌ పోలీసులు స్పందించారు. చౌట్యూ అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు అలెగ్జాండర్‌కు రీట్వీట్‌ చేశారు పోలీసులు.

Other News

Comments are closed.