రాజీవ్‌ జయంతి సందర్భంగా 20న సద్భావనా ర్యాలీ

share on facebook

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్‌  పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. 20న ఉదయం 9గంటలకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పంజాగుట్ట కూడలిలోరాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి సద్భావన ర్యాలీ, యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిజాంకాలేజీలో రాజీవ్‌గాంధీ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 5.30గంటలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అప్జలుద్దీన్‌ ఆధ్వర్యంలో ప్రకాశంహాలులో జరిగే కార్యక్రమంలో మాజీ సీఎం రోశయ్య, ప్రొ.నాగేశ్వర్‌, సీనియర్‌జర్నలిస్టు రామచంద్రమూర్తి పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు  వేడుకల ఏర్పాట్లపై పార్టీ నాయకులతో  గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్‌, పొన్నం ప్రభాకర్‌, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, పలువురు డీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.

Other News

Comments are closed.