రాఫెల్‌పై మరోమారు చిదంబరం విమర్శలు

share on facebook

New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A)

జైట్లీ తీరుపై మండిపడ్డ మాజీ ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసే ప్రశ్నేలేదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందించారు. సోమవారం ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లతో కేంద్రంపై విమర్శల దాడికి దిగారు. దీనిపై కాంగ్రెస్‌ ఇప్పటికే దుమారం లేపుతోంది. అవినీతికి మోడీయే కేంద్రమని విమర్శిస్తోంది. నిజానికి రెండు పార్శ్యాలు ఉండవని ఆర్థికశాఖ మంత్రి జైట్లీ అన్నారు. ఇది నిజమే. కానీ ఆర్థికమంత్రి ఆలోచన పరంగా మాత్రం నిజానికి రెండు వెర్షన్లు ఉన్నాయి. ఇందులో అసలు ఏది నిజమనే విషయాన్ని కనిపెట్టేందుకు ఉన్న మార్గమేమిటి? ఒకటి రాఫెల్‌ ఒప్పందంపై విచారణ చేయడం లేదా టాస్‌ వేయడం. నేను అనుకోవడం ఆర్థికమంత్రి రెండు వైపులా బొమ్మ ఉండే నాణెంతో టాస్‌ వేయడానికే మొగ్గుచూపుతారు. ఈ ఒప్పందంపై విచారణ చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడం సరైనది కాదు. వచ్చే ఆరు లేదా 12 నెలల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’ అంటూ చిదంబరం ట్వీట్లు చేశారు. ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ¬లన్‌ చేసిన వ్యాఖ్యలపై ఓ టీవీ ఇంటర్వ్యూలో జైట్లీ స్పందించారు. ¬లన్‌, రాహుల్‌గాంధీ ప్రకటనల మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు కనపడుతోందన్నారు. ‘¬లన్‌ మొదట రిలయన్స్‌ను భాగస్వామిగా భారత ప్రభుత్వమే సూచించిందని వ్యాఖ్యానించారు. అనంతరం చేసిన ప్రకటనల్లో మొదటి దానితో విభేదించారు. రిలయన్స్‌ డిఫెన్స్‌ తరఫున భారత ప్రభుత్వం పైరవీ చేసిందో లేదో తనకు తెలియదని చెప్పారు. భాగస్వాములను ఆయా కంపెనీలే ఎంచుకున్నాయన్నారు. నిజమనేదానికి రెండు పార్శ్యాలు ఉండవు’ అని జైట్లీ పేర్కొన్నారు.

Other News

Comments are closed.