రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె పట్టం

share on facebook

సిద్దిపేట జిల్లా ప్రతినిది సెప్టెంబర్10 (జనంసాక్షి )

రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని అందుకే టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల కి వెళ్తుంది అని కాంగ్రెస్  ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోటురి మానవతా రాయ్ ఆరోపించారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉత్తంకుమార్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సిద్దిపేట లో పి సి సి సభ్యుడు పూజల హరికృష్ణ  ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఏ గ్రామాల్లో కి వెళ్లిన ఇందిరమ్మ ఇళ్ల కనిపిస్తున్నాయి తప్ప డబుల్ బెడ్రూం ఏక్కడ లేవని అలాగే ఉంద్యోగా లు భర్తీ చేయటం లో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముందస్తు ఎన్నికల ఐదు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు కార్యాక్రమంలో మైనారిటీ సెల్ కన్వీనర్ చాంద్ పాషా మహిళ విబాగం అధ్యక్షురాలు లక్ష్మీ నర్సవ్వ  బిజన్ బి గోపికృష్ణ వాహాబ్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.