రామయాంపేటలో పోలీసుల కవాతు

share on facebook

మెదక్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ నెల 7న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామాయంపేటలో పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. పట్టణ వీధుల్లో సుమారు 100 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు కవాతులో పాల్గొన్నారు. అనంతరం సీఐ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రక్షణ కల్పిస్తామనే భరోసా ఇవ్వడానికే కవాతు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్‌ఐ మహేందర్‌, స్థానిక పోలీసులు ఉన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేయాలని, ప్రలోభాలకు లొంగవద్దన్నారు. అలాగే దొంగ ఓట్లు వేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

Other News

Comments are closed.