రాష్ట్ర అవతరణ దినోత్సవాని పండుగల నిర్వహించాలి 

share on facebook

రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌

సూర్యాపేట బ్యూరో, మే 26 (జనంసాక్షి):

తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రతి జిల్లాలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గిరిజన మరియు సాంస్క తిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబందించిన ఏర్పాట్ల పై అన్ని జిల్లా కల్లెక్టర్లు, డి.పి.ఆర్‌.ఓ లు మరియు సంబందిత ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఒక పండుగల నిర్వహించాలని, ప్రతి గ్రామంలో,ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ ప్రతి పాఠశాలలు , వసతి గ హాలు, కళాశాలలో అలాగే రేసిడేన్షియల్‌ పాఠశాలలో జనవరి 26, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాల మాదిరిగా నిర్వహించాలని, అలాగే ప్రతి మండల కేంద్రంలో డివిజన్‌ కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని అధికారులకు కోరారు. అనంతరం రాష్ట్ర బాష సాంస్క తిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకలను ఎలాంటి పొరపాట్లు లేకుండా గత ఏడాది నిర్వహించిన మాదిరిగానే ఘనంగా నిర్వహించాలని కోరారు. అంతేగాక ఈ వేడుకలలో వివిధ రంగాలో ప్రావీణ్యంగల వారిని 12 మందిని అవార్డులకు ఎంపిక చేయాలనీ ముఖ్యంగా 3 రోజుల పాటు జిల్లా కేంద్రంలో సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించాలని అలాగే మండల స్థాయి లో కూడా సాంస్క తిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనీ, స్వచ్చంద సంస్థల ద్వారా సేవ కార్యక్రమలు నిర్వహించి వ ద్దాశ్రామాలలో బట్టలు, స్వీట్లు, పండ్లు పంపిణి చేయాలని, అలాగే అంధుల పాటశాలలో విద్యార్ధులకు బట్టలు, అవసరమైన పరికరాలు అందించాలని తెలిపారు. జిల్లా , మండల డివిజన్‌ స్థాయిలో రక్త దాన శిబిరాల ఏర్పాటు, సంక్షేమ హాస్టల్‌ లు మున్సిపాలిటిలు, మండల పరిదిలో పండ్లు స్వీట్లు పంపిణి చేయాలనీ అధికారులను కోరారు. తదుపరి జిల్లా కలెక్టర్‌ కె.సురెంద్రమోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే మండల విద్యా శాఖ అధికారులను అదేశి%శీ%చామని అయన తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన వారిని గుర్తించి అవార్డులకు ఎంపిక చేస్తామని, సాంస్క తిక కార్యక్రమాలతో పాటు స్థానిక జునియర్‌ కళాశాలలో ఫుడ్‌ కోర్టు ఏర్పాటు చేస్తామని అయన అన్నారు. అలాగే జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన 12 మందిని ఎంపిక చేసి జిల్లా స్థాయిలో నగదు పురస్కారాలు అందజేస్తామని అయన అన్నారు. కావున ఉత్తమ రైతులు, ఉత్తమ ఉపాద్యాయులు, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి, ఉత్తమ ఎన్‌.జి.ఓ, ఉత్తమ క్రీడా కారుడు, ఉత్తమ లిటేరస్సి పర్సనాలిటి అలాగే (పద్య, గద్య) (తెలుగు, హిందీ) ఉత్తమ ఆర్టిస్ట్‌( డాన్సర్‌, సింగర్‌, ఆర్టిస్ట్‌, మేజిషియన్‌) ఉత్తమ వేద పండిట్‌, ఉత్తమ జర్నలిస్ట్‌, ఉత్తమ సైంటిస్ట్‌, ఉత్తమ న్యాయవాది, వివిధ రంగాలలో ప్రావీణ్యం ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ నగదు పురస్కార అవార్డు కొరకు నేరుగా గాని లేదా సంబందిత శాఖ అధికారుల ద్వారా గాని 28-05-2018 మధ్యాహ్నం లోపు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట నందు అందజేయాలని అయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌ తో పాటు, డిఆర్‌ఓ పి.యాది రెడ్డి , డిఆర్‌డిఓ కిరణ్‌ కుమార్‌,జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని జ్యోతిర్మయి, ఆర్‌డిఓ మోహనరావు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.