రాష్ట్ర ఖజానాను చంద్రబాబు..

share on facebook

విదేశాల్లో దాచుకుండు
– ఆ సొమ్ముతో అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు
– నాలుగేళ్లలో మూడులక్షల కోట్ల అవినీతి
– బీజేపీతో వైసీపీ కలిసిందని తప్పుడు ప్రచారం తగదు
– మేం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం
– వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం, మే16(జ‌నం సాక్షి) : రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దాచుకున్న రూ. మూడు లక్షల కోట్లను తిరిగి రాష్ట్ర ఖజానాలో జమ చేస్తే దాంతో అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవచ్చని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత విజయసాయి రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజా
సంకల్ప యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టిన ఆయన బుధవారం విూడియాతో మాట్లాడారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ సమస్యలును పార్టీ దృష్టికి తెస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైగింక దాడులపై ప్రజల తీవ్ర ఆవేదనకు, ఆగ్రహానికి గురైతున్నట్టు వెల్లడించారు.
తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ లైగింక దాడుల్లో భాగస్వాములవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల పాలనలో రూ. మూడు లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి, ప్రభుత్వ పథకాల్లో, ప్రాజెక్టుల్లో ధనార్జనే ధ్యేయంగా పాలన సాగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చి.. వైసీపీ, బీజేపీతో జతకట్టిందని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తూ.. నాటకాలు ఆడుతున్నారని మండ్డిపడ్డారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని జగన్‌ గుర్తు చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని తెలిపారు.

Other News

Comments are closed.