రిజిస్టేష్రన్‌ శాఖ ఉద్యోగి నివాసంలో ఏసీబీ సోదాలు

share on facebook

రూ.2కోట్లమేర ఆదాయానికి మించి ఆస్తుల గుర్తింపు
హైదరాబాద్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అనిశా అధికారులు మేడ్చల్‌ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ కిషన్‌ ప్రసాద్‌ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం నుంచి తనిఖీలు చేసిన అధికారులు పలు విలువైన భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సుమారు రెండు కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కనుగొన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అల్మాస్‌గూడ ప్రాంతంలో రెండు ఇళ్లు, రెండు ఎకరాల నాలుగున్నర గుంటల వ్యవసాయ భూమి, హస్తినాపురంలో ఇంటి స్థలంతో పాటు పది తులాల బంగారం, బ్యాంకు పాస్‌పుస్తకాలు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. మేడ్చల్‌ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు కిషన్‌ ప్రసాద్‌ బంధువుల ఇళ్లల్లోనూ మొత్తం అయిదు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Other News

Comments are closed.