రుద్రూర్ మండలంలో స్వాతంత్ర వజ్రోత్సవ సంబురాలు

share on facebook
రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్  మండల  కేంద్రంలో  స్వాతంత్ర  వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత 2,3 రోజుల నుండి ఆయా గ్రామాల సర్పంచ్ లు , మండల నాయకులు, మండల ప్రజలకు   జాతీయ జెండాలను పంపిణీ చేస్తూ ప్రజలలో దేశ భక్తిని పెంచుతున్నారు. ఈ కోవలోనే శుక్రవారం రోజున పలు కార్యక్రమలు నిర్వహించారు అక్బర్ నగర్ సర్పంచ్ గంగామణి వరప్రసాద్ వారి గ్రామంలోని  ప్రకృతి చికిత్సలయంలో  జాతీయ సమైక్య రక్షాబంధన్ కార్యక్రమన్నీ మరియు జాతీయ జెండా వితరణ  చేయడం జరిగింది.
 చిక్కడపల్లి గ్రామంలో తెరాస నాయకుడు మహమ్మద్ లాల్  వారి వారి గ్రామస్తులకు జాతీయ జెండాలను పంచడం జరిగింది కుల, మతాలకు అతీతంగా  జాతీయ సమైక్య రక్షాబంధన్ కార్యక్రమన్నీ  నిర్వహించారు,
రుద్రూర్ మండల కేంద్రంలోని ముస్లిం సోదరులు, మండల కేంద్రంలోని నాయకుల తో కలిసి జాతీయ జెండాను పంపిణీ చేస్తూ, ఘర్ ఘర్ పే తీరంగా, భారత్ మాత కి జై
అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంతే కాకుండా కుల, మతాలకు అతీతంగా  జాతీయ సమైక్య రక్షాబంధన్ కార్యక్రమన్నీ  రుద్రూర్ పోలీసు స్టేషన్ లోని పోలీసులకు మరియు
ముస్లిం సోదరుడు సుబానికి రక్ష బంధన్ కట్టడం జరిగింది
బొప్పాపూర్ గ్రామంలో
బీజేపీ మండల నాయకుడు కుర్మాజీ సాయిలు  బీజీపీ పార్టీ తరుపున మరియు తెరాస పార్టీ మరియు గ్రామ పంచాయతీ తరుపున
జడ్పీటిసి నారోజి మరియు గ్రామ సర్పంచ్ సావిత్రి లింగం
గ్రామ పంచాయతీ తరుపున  జాతీయ జెండాను పంపిణీ గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు.
సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ కి గ్రామ సడ్రిలు రక్ష బంధన్ కట్టి శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ75 ఏళ్ల
ఎందరో మహనీయుల త్యాగఫలంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు ఈ కార్యక్రమంలో . జడ్పీటిసి నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ , తెరాస నాయకుడు అక్కపల్లి  నాగేందర్, మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, సంగయ్య, ముస్లిం సోదరులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు, వార్డు మెంబర్లు, ఇతర నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు
 

Other News

Comments are closed.