రెండు ప్రమాదాలు: ముగ్గురు మృతి

share on facebook

అమరావతి రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం

హైదరాబాద్‌,జూన్‌13(జ‌నం సాక్షి): వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. బొల్లారం రైల్వే స్టేషన్‌లో బుధవారం ప్రమాదం సంభవించింది. పట్టాలు దాటుతున్న ఇద్దరిని అమరావతి ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ, పంకజంగా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోఘటనలో శంషాబాద్‌ విమానాశ్రయం బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన తర్వాత లారీతో పాటు డ్రైవర్‌ అక్కడి నుంచి ఉడాయించాడు. రక్తపుమడుగులో పడి ఉన్న క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ రోడ్డు ప్రమాదం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఎయిర్‌పోర్టు పోలీసులు చెప్పడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Other News

Comments are closed.